విశ్వక్ సేన్ బ్యాక్ టు #VS10 సెట్

hero vishwak sen back to VS10 movie set

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం సినిమా జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ ఈ ఏడాది పలు సినిమాలను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. అందులో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా గామి. ఈసినిమాా మార్చి8వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా కంటే ముందు మరోసినిమాను విశ్వక్ సేన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. VS10 అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. అయితే తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు విశ్వక్ సేన్. VS10 సెట్ నుండి ఒక పిక్ ను పోస్ట్ చేస్తూ ప్రతిరోజూ ఒక కొత్త దృక్కోణాన్ని తెస్తుంది. సేమ్ ఇంటెన్సిటీ, ప్యాషన్, ప్రేమతో అన్వేషించడానికి మరొక సినిమా..సినిమా అనేది నేను ఇంటిలా ఫీల్ అయ్యే ప్రపంచం అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న సనిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seven =