సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా హిట్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకునే దిశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో కుర్చీ మడతపెట్టి పాటకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. సినిమా రిలీజ్ కు ముందే ఈపాట సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. థియేటర్లలో కూడా ఈపాట ఆడియన్స్ చేత విజిల్స్ వేయించింది. అయితే తాజాగా ఈపాట ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
#KurchiMadathapetti Full Video Song is Out, Now Enjoy the Electrifying Dance moves of SUPER🌟 @urstrulyMahesh @sreeleela14 🔥🕺💃
A @MusicThaman Musical 🎹
✍️ @ramjowrites
🎤 @itsahithii @srikrisin #GunturKaaram #Trivikram #Thaman @meenakshiioffl… pic.twitter.com/MlkmQGfliW— Haarika & Hassine Creations (@haarikahassine) February 1, 2024
కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించగా రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. థమన్ సంగీతం అందించిన ఈసినిమాను..హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: