మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ సినిమాతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ముల్లోకాలు, పంచభూతాల నేపథ్యంలో సోషియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత చిరంజీవి చేస్తోన్న సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతో దీనిపై ఇటు మెగాభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన ‘విశ్వంభర’ టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సాలిడ్ అప్డేట్ అందించింది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ వెల్లడించారు. కాగా దీనికి ముందుగా చిరంజీవి ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు. సినిమాలోని పాత్ర ప్రకారం ఫిట్‌గా కనిపించేందుకు 68 ఏళ్ల వయస్సులోనూ ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 4 దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ సినిమాల పట్ల, తన పాత్రల పట్ల చిరు కమిట్మెంట్ అద్భుతం అని ప్రశంసిస్తున్నారు.
A LEGEND RISES 🔮🔥
MEGASTAR @KChiruTweets sets his foot into the mighty world of #Vishwambhara ❤🔥
Shoot in Progress.
In cinemas 10th Jan 2025 🌠@DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota @mayukhadithya @sreevibes @gavireddy_srinu @UV_Creations pic.twitter.com/Qrzvlsuv5b
— UV Creations (@UV_Creations) February 2, 2024
కాగా అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ‘విశ్వంభర’ను నిర్మాణసంస్థ యూవీ క్రియేషన్స్ టాలీవుడ్ చరిత్రలో ఒక మాస్టర్ పీస్‌లా నిలిచిపోయేలా తీయడానికి నిశ్చయించుకుంది. దీంతో ఈ చిత్రం చిరు కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం గమనార్హం. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి, కీరవాణి కాంబోలో అనేక మ్యూజికల్ హిట్ మూవీస్ ఉన్న నేపథ్యంలో.. మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయనుండటంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్స్ వివరాలు వెల్లడించనున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: