రవితేజ గారి సినిమాకి మ్యూజిక్ చేయడం నా అదృష్టం.. మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాన్డ్

Davzand About Ravi Teja Eagle Movie

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈగల్ సంగీత దర్శకుడు డేవ్ జాన్డ్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీ నేపధ్యం గురించి చెప్పండి ? ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
-నేను సెల్ఫ్ ఫ్రీ లాన్స్ మ్యుజిషియన్ ని. హీరో శ్రీ విష్ణు, నేను గీతం కాలేజ్ లో క్లాస్ మేట్స్. శ్రీ విష్ణు గారిని కలవడం, అప్పుడే కార్తిక్ గారికి నా ట్యూన్స్ వినిపించేవాడిని. ఆయన రాసుకున్న ప్రతి స్క్రిప్ట్ కి ముందు నుంచే మ్యూజిక్ కంపోజ్ చేయడం, అలా కార్తిక్ గారితో జర్నీ కొనసాగింది. రవితేజ గారితో ఈగల్ సినిమా ఓకే అయిన తర్వాత ”ఆయన్ని ఒప్పించి నిన్ను ప్రాజెక్ట్ లోకి తీసుకురాలేను’ అని కార్తిక్ ముందే చాలా స్పష్టంగా చెప్పారు. రవితేజ గారి సినిమాకి సహజంగానే వండర్ ఫుల్ బిగ్ కంపోజర్స్ పని చేస్తారు. అయితే నా ప్రయత్నంగా మూడు ట్రాక్స్ కంపోజ్ చేసి కార్తిక్ కి ఇచ్చాను. ఈ మూడు ట్రాక్స్ రవితేజ గారు విన్నారు. ఆయనకి చాలా నచ్చాయి. అలా ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు.

రవితేజ గారు లాంటి పెద్ద హీరో.. మీకు అవకాశం ఇవ్వడానికి గల కారణం ఏమైయింటుందని భావిస్తున్నారు?
– పదో తరగతి నుంచి నా మ్యూజిక్ జర్నీ మొదలైయింది. పియానో, గిటార్, డ్రమ్స్, ప్రోగ్రామింగ్ చేసేవాడిని. సోని ఎంటర్ నేషనల్ గేమ్స్ కి మ్యూజిక్ చేసేవాడిని. మొదటి నుంచి ఫిల్మి స్ట్రక్చర్ పై ఒక అవగాహన వుంది. స్క్రీన్ ప్లే లోని షిఫ్ట్స్ ని అర్ధం చేసుకునేవాడిని. అలాగే కార్తిక్ కూడా చాలా సపోర్టివ్. చాలా విషయాలు చెప్పేవాడు. అలాగే ఏఆర్ రెహమన్, అనిరుద్, దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఇలా అందరి సంగీతంపై లోతైన పరిశీలన వుంది. ఇవన్నీ కూడా సినిమా సంగీతంపై పూర్తి అవగాహన వచ్చేలా చేశాయి. ఈగల్ లో నేపధ్యం సంగీతం విని అద్భుతంగా చేశానని రవితేజ గారు ప్రశంసించారు. అది చాలా తృప్తిని ఇచ్చింది. రవితేజ గారితో మాట్లాడినపుడు చాలా స్ఫూర్తిదాయకంగా వుంటుంది.

ఈగల్ లో మ్యూజిక్ లో ఎలాంటి కొత్తదనం ప్రయత్నించారు ?
– ఈగల్ లో చాలా కొత్త తరహా సంగీతం చేశాం. ఈగల్ ఆన్ హిస్ వే అనేది కంప్లీట్ ఇంగ్లీష్ ట్రాక్. రవితేజ గారికి ప్రోపర్ ఇంగ్లీష్ ట్రాక్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈగల్ సినిమాలో స్క్రీన్ ప్లే, యాక్షన్, దర్శకుడు తీసిన విధానం చాలా యూనిక్ గా వుంటాయి. ఇందులో చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వున్నాయి. ఆడు మచ్చా పాట మాస్ ని మెస్మరైజ్ చేస్తుంది. గల్లంతు పాట మనసుని హత్తుకునే మెలోడీ. రాబోతున్న నాలుగో ట్రాక్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈగల్ మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది. రవితేజ గారి యాక్షన్ ఎపిసోడ్స్, ఎక్స్ ట్రార్డినరీ ఫైట్స్, లవ్ ట్రాక్, పోలెండ్ లో షూట్ చేసిన ఇంటర్ నేషనల్ ఎపిసోడ్స్ వున్నాయి. వీటన్నటిలో మ్యూజిక్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సౌండ్ డిజైన్ చాలా కేర్ ఫుల్ గా చేశాం.

తొలిసారి రవితేజ గారిని కలసినప్పుడు ఏమనిపించింది ?
-రవితేజ గారిని తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యాను. పక్కన కూర్చోమని పూతరేకులు తెప్పించారు. దాదాపు గంటపాటు మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం. చాలా మోటివేట్ చేశారు. రవితేజ గారు వండర్ ఫుల్ పర్సన్. ఆయన అభిమానులకు, కార్తిక్ రాసుకున్న కథకు నా మ్యూజిక్ తో న్యాయం చేకూరేలా చూడాలనే భాద్యతతో పని చేశాను. రవితేజ గారు చాలా సపోర్ట్ చేశారు. చాలా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు.

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-కార్తీక్ మంచి అభిరుచి గల దర్శకుడు. మ్యూజిక్ విషయంలో తన టేస్ట్ చాలా పర్టిక్యులర్ గా వుంటుంది. ఈగల్ కథ, స్క్రీన్ ప్లేని అద్భుతంగా చేశారు. ఆయన అభిరుచికి తగ్గట్టుగానే మ్యూజిక్ చేశాం. ఈ సినిమా షూటింగ్ జరిగినప్పుడు సెట్స్ కి వెళ్లాను. సినిమా అంతా ఒక పండగలా జరిగింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా సపోర్టివ్ ప్రొడ్యూసర్స్. విశ్వప్రసాద్ గారు చాలా ప్రోత్సహించారు. సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. వారితో మరిన్ని సినిమాలు చేయాలని వుంది.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
-కార్తిక్ గారితోనే మరో సినిమా చేస్తున్నా. త్రినాథ్ గారి ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాను. మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల్లో వున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − four =