గుంటూరు కారంతో.. మరో అరుదైన రికార్డు సాధించిన మహేష్ బాబు

Mahesh Babu's Guntur Kaaram Movie Becomes Fastest 1 Cr Grosser at Sudarshan 35MM Theatre

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మూవీ మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో గానే నడించిందన్న ప్రశంసలు అందుకుంది. మహేష్ యాక్టింగ్, డైలాగ్ స్లాంగ్, డ్యాన్స్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువలో ఉంది. ఈ సినిమాతో మహేష్ బాబు రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఇప్పటికే 100 కోట్ల షేర్ సాధించిన 5వ సినిమా, అలాగే తక్కువ రోజుల్లో 200 కోట్ల మార్క్ అందుకున్న తొలి రీజినల్ సినిమా హీరోగా మహేష్ పలు రికార్డులు సృష్టించాడు. ఇదే క్రమంలో తాజాగా ఆయన మరో అరుదైన రికార్డ్ అందుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒకే థియేటర్‌లో 1 కోటి గ్రాస్ మార్కును క్రాస్ చేసిన మహేష్ ఏడవ సినిమాగా గుంటూరు కారం నిలిచింది. విడుదలైన తర్వాత కేవలం 17 రోజుల్లో అత్యంత వేగంగా రూ. 1 కోటి వసూలు చేయడం విశేషం. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల ప్రముఖ సుదర్శన్ థియేటర్‌ దీనికి వేదికైంది. అంతకుముందు మహేష్ హీరోగా నటించిన 6 చిత్రాలు ఇదే థియేటర్‌లో రూ. 1 కోటికి పైగా వసూళ్లు సాధించాయి. ‘మురారి’, ‘ఒక్కడు’, ‘అతడు’, ‘పోకిరి’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరూ’.. సినిమాలు ఈ ఫీట్ సాధించాయి. కాగా వీటిలో ‘మురారి’, ‘ఒక్కడు’, ‘అతడు’, ‘పోకిరి’ చిత్రాలైతే ఏకంగా 175 రోజులు ఆడటం విశేషం. తాజాగా ‘గుంటూరు కారం’తో మహేష్ మరోసారి రూ. 1 కోటి ఫీట్ రిపీట్ చేయడం గమనార్హం. దీంతో సుదర్శన్ 35MM థియేటర్‌ సూపర్ స్టార్ అడ్డా అని మరోసారి రుజువు అయింది.

ఇక మహేష్ ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారు వారి పాట’, ‘గుంటూరు కారం’ సినిమాలతో ఐదుసార్లు 100కోట్ల షేర్ అందుకున్నాడు. అయితే ఇవన్నీ రీజినల్ మూవీస్ కావడం గమనార్హం. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయకుండానే మహేష్ ఈ ఘనత అందుకోవడం గమనార్హం. కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. అలాగే జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్‌కు ముందే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లుగా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అనిపించుకుంది.

ఆన్‌లైన్‌ లో మూవీస్‌ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 13 =