నాగార్జున గారితో నటించడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ – ఆషికా రంగనాథ్

Naa Saami Ranga Movie Success Celebrations Ashika Ranganath Praises Hero Nagarjuna

కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించగా.. పవన్ కుమార్ సమర్పించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. టాలీవుడ్ యువ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మరియు నటీమణులు మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సెలబ్రేషన్స్‌ని నిర్వహించగా.. యూనిట్ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. “నా సామిరంగ జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. దర్శకుడు విజయ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన కష్టానికి తగిన ఫలితం ఈ సినిమా విజయంతో వచ్చింది. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కీరవాణి గారితో వర్క్ చేయడం చాలా అనందంగా వుంది. నిర్మాతలకు ధన్యవాదాలు. అందరూ నన్ను వరాలు పేరుతో పిలవడం చాలా ఆనందంగా వుంది. నాగార్జున గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. నాగార్జున గారితో నటించడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు” అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =