ప్రస్తుతానికి ఎక్కడ చూసినా హనుమాన్ ప్రభంజనమే కనిపిస్తుంది. భాషతో సంబంధం లేకుండా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రశాంత్ వర్మ మొదటినుండీ తన మార్క్ ను చూపిస్తూనే ఉన్నాడు. అ! సినిమా ఒక డిఫరెంట్ జోనర్.. కల్కి థ్రిల్లర్, జాంబిరెడ్డి తో హాలీవుడ్ లోనే వినే జాంబీస్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ సినిమాను తీసి ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యాడు. అంతేకాదు తక్కువ బడ్జెట్ తో కూడా అబ్బురపరిచే విజువల్స్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించి శభాష్ అనిపించుకోవచ్చని కూడా నిరూపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిందంటే ఏరేంజ్ రెస్పాన్స్ వస్తుందో అర్థమవుతుంది. ఇక్కడ మాత్రమే కాదు హిందీలో అలానే ఓవర్సీస్ లో కూడా హనుమాన్ సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. ఐదు రోజుల్లోనే హిందీలో రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇక యూఎస్ఏ అయితే పెద్ద సినిమాలు కూడా అందుకోలేని మార్క్ ను సొంతం చేసుకుంటుంది. నార్త్ అమెరికాలో నాలుగు రోజుల్లో 3 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన ఈసినిమా ఐదు రోజుల్లో 4 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో ఆల్ టైమ్ తెలుగు ఫిలిం గ్రాస్ కలెక్షన్స్ ను సాధించిన టాప్ 5 సినిమాల్లో ఈసినిమా చోటు దక్కించుకుంది. మరి సినిమాగా వచ్చిన ఈసినిమా ఈరేంజ్ లో తన సత్తా చాటడం నిజంగా గర్వకారణమే.
కాగా తేజ సజ్జా హీరోగా నటించిన ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: