కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన అయలాన్ బాక్సాఫీస్ వద్ద హావ చూపిస్తుంది.ఈ పొంగల్ కు తమిళ్ లో ఈసినిమాతో పాటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా రిలీజ్ అయ్యింది.రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది.అయితే అయలాన్ డామినేషన్ చూపిస్తుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో అయలాన్ స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తుంది.5రోజుల్లో ఈసినిమా 50కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.చివరి 24గంటల్లో బుక్ మై షో లో 100.64k టికెట్స్ బుక్ అయ్యాయి.ఫుల్ రన్ లో అయలాన్ 100కోట్ల మార్క్ ను చేరుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా యోగిబాబు,కరుణాకర్ కీలక పాత్రలో నటించారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా కేజెఆర్ స్టూడియోస్ నిర్మించింది. తెలుగులో కూడా ఈసినిమా సంక్రాంతికే విడుదలకావాల్సి ఉండగా పోటీ ఎక్కువగా ఉండడంతో డ్రాప్ అయ్యింది.ఇక ఈరోజు తెలుగు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.ఈసినిమా అదే టైటిల్ తో ఈనెల 26న విడుదలకానుంది.ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఈసినిమా హక్కులను దక్కించుకున్నారు.మరి తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: