డెవిల్‌లో కళ్ళు చెదిరే కాస్ట్యూమ్స్‌ను ఉప‌యోగించిన కళ్యాణ్ రామ్, వాటి ప్రత్యేకతలేంటో తెలుసా?

Nandamuri Kalyan Ram Wears 90 Indian Themed Costumes For Devil

డిఫరెంట్ మూవీస్‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇదొక పీరియడ్‌ డ్రామా. బ్రిటీష్‌వారు ఇండియాను ప‌రిపాలించిన కాలానికి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌టంతో నాటి ప‌రిస్థితుల‌ను ఆవిష్క‌రించేలా భారీగా సినిమాను చిత్రీక‌రించారు. అలాగే న‌టీన‌టులకు సంబంధించిన వ‌స్త్రాలంక‌ర‌ణ భార‌తీయ‌త‌ను ప్ర‌తిబింబించేలా ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో క‌ళ్యాణ్ రామ్‌ను గ‌మ‌నిస్తే ఆయ‌న ఇందులో గూఢ‌చారిగా క‌నిపించ‌బోతున్నారు. కాగా ఇలాంటి తరహా పాత్రను పోషించడం నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌కు కూడా మొదటిసారి కావడం విశేషం. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా వీక్షించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డెవిల్’ ద‌ర్శ‌క నిర్మాత అభిషేక్ నామా, కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్, హీరో క‌ళ్యాణ్ రామ్ లుక్‌ను సినిమా ఆసాంతం స‌రికొత్త‌గా ఉండేలా డిజైన్ చేశారు.

దీని గురించి కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్ మాట్లాడుతూ ‘‘అభిషేక్ నామాగారు డెవిల్ స్క్రిప్ట్ నాకు వివరించ‌గానే హీరోగారి లుక్ డిఫరెంట్‌గా ఉండాల‌ని అర్థ‌మైంది. ఇందులో హీరో భారతీయుడు, అయిన‌ప్ప‌టికీ బ్రిటీష్ గూఢ‌చారిగా ప‌ని చేస్తుంటారు. ఆయ‌న పాత్రను ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయాల‌నుకున్నాను. డెవిల్‌లో క‌ళ్యాణ్ రామ్‌ను గ‌మ‌నిస్తే ఆయ‌న ధోతి కట్టుకుని ఉంటారు. పైన ఒక వెయిస్ట్‌ కోటుని ధ‌రించి ఉంటారు. ఆయ‌న కాస్ట్యూమ్స్‌లో భార‌తీయ‌త క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం’’ అని తెలిపారు.

‘డెవిల్’ కాస్ట్యూమ్స్ హైలైట్స్‌ ఇవే..

  • డెవిల్ సినిమా కోసం క‌ళ్యాణ్ రామ్ 90 కాస్ట్యూమ్స్‌ను ఉప‌యోగించారు.
  • ఇట‌లీ నుంచి తెప్పించిన‌ మోహైర్ ఊల్‌తో 60 బ్లేజ‌ర్స్‌ను ప్ర‌త్యేకంగా తయారు చేశారు.
  • వెయిస్ట్ కోటుతో పాటు దేశీయ‌ కాట‌న్‌తో కుర్తా, ధోతిని తయారు చేశారు.
  • ప్ర‌తీ కాస్ట్యూమ్ (బ్లేజ‌ర్‌, కుర్తా, ధోతి)కి 11.5 మీట‌ర్స్ ఫ్యాబ్రిక్‌ను ఉప‌యోగించారు.
  • హీరోని స్టైల్‌గా చూపించే క్ర‌మంలో 25 ప్ర‌త్యేక‌మైన‌ వెయిస్ట్ కోట్స్‌ను ఉప‌యోగించారు.
  • హీరో వేసుకునే బ్లేజ‌ర్ జేబు ప‌క్క‌న వేలాడుతూ ఉండేలా ఓ హ్యాంగింగ్ వాచ్‌ను ప్ర‌త్యేకంగా త‌యారు చేశారు.
  • పురాత‌న వాచీల‌ను సేక‌రించే వ్య‌క్తి డిల్లీలో ఉంటే అత‌ని ద‌గ్గ‌ర నుంచి ఈ హ్యాంగింగ్ వాచ్‌ను తీసుకురావ‌టం విశేషం.
  • కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్‌కి డెవిల్ 60వ చిత్రం.. క‌ళ్యాణ్ రామ్‌తో ఇది 6వ సినిమా.
  • ఎం.ఎల్‌.ఎ, 118, ఎంత మంచివాడ‌వురా వంటి క‌ళ్యాణ్ రామ్ సినిమాల‌కు రాజేష్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు.
  • అలాగే క‌ళ్యాణ్ రామ్ చేయ‌బోతున్న నెక్ట్స్ 3 సినిమాల్లోనూ రాజేష్ వ‌ర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + sixteen =