ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల పరంగా కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె షూటింగులకు విరామం ప్రకటించి చికిత్స తీసుకుంటున్నారు. అయితే సినిమాలకు విరామం ఇచ్చినా.. సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గానే ఉంటోంది. ఈ క్రమంలో సమంత తాజాగా విడుదలైన ఒక సినిమా గురించి రివ్యూ ఇచ్చింది. ఈ ఏడాది తాను చూసిన బెస్ట్ ఫిలిం ఇదే అంటూ కితాబు కూడా ఇచ్చింది. అలాగే ఈ సినిమా కథ అద్భుతం అని, ఇలాంటి మూవీలో నటించడానికి ఒప్పుకున్న నటీనటులకు హ్యాట్సాఫ్ అని ప్రశంశల వర్షం కురిపించింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే..?
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి-జ్యోతిక జంటగా నటించిన తాజా చిత్రం ‘కాథల్-ది కోర్’. తాజాగా ఈ సినిమాపై సమంత సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేరకు సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. అందులో..”‘కాథల్-ది కోర్’.. మూవీ ఆఫ్ ది ఇయర్. ఈ ఏడాదిలో నేను చూసిన బెస్ట్ ఫిల్మ్ ఇదే. ఈ అందమైన శక్తివంతమైన చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి. మమ్ముట్టి సార్ మీరే నా హీరో. ఇందులో మీ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా ఫీల్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా. జ్యోతిక గారూ లవ్ యూ” అని పేర్కొన్నారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు జియో బేబీని లెజెండ్ అని సమంత పేర్కొంది.
కాగా ‘నాన్ పాకల్ నేరతు మాయక్కమ్’, ‘క్రిస్టోఫర్’, ‘కన్నూర్ స్క్వాడ్’ వంటి హిట్ సినిమాల తర్వాత మమ్ముట్టి నటించిన చిత్రమే ఈ ‘కాథల్ ది కోర్’. దర్శకుడు జియో బేబి ఈ సినిమాను తెరకెక్కించగా నవంబర్ 23న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. స్వలింగ సంపర్కులు, మరియు వారిపట్ల సమాజం తీరు కథాంశంగా ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమాను కొన్ని అరబ్ దేశాలు బ్యాన్ చేశాయి. ఈ చిత్రం స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉందని కువైట్, ఖతార్ తదితర దేశాలు ఈ సినిమాను ఆయా దేశాల్లో నిషేధించాయి.
‘కాథల్-ది కోర్’ సినిమా కథ ఏంటంటే..?
కథానాయకుడైన జార్జ్ (మమ్ముట్టి) బ్యాంకులో పని చేసి రిటైర్ అయిన ఉద్యోగి. భార్య ఓమన (జ్యోతిక)తో కలిసి కేరళలోని తీకోయ్ అనే ఒక చిన్న గ్రామంలో నివసిస్తుంటాడు. అయితే ఆ గ్రామంలో ఎన్నికలు రావడంతో జార్జ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే అతడు నామినేషన్ వేసిన తర్వాత భార్య అతడిపై విడుకుల కోసం కోర్టు మెట్లుక్కుతుంది. అదే గ్రామంలో డ్రైవింగ్ స్కూల్ నడిపే ఒక వ్యక్తికి, తన భర్త జార్జ్‌కి మధ్య స్వలింగ సంపర్క బంధం ఉందని, అందుకే విడాకులు కావాలని కోరుతుంది. కానీ తన భార్య చేసిన ఈ ఆరోపణలను జార్జ్ ఖండిస్తాడు. ఈ వార్త సెన్సేషన్ అవుతుంది. అయితే ఆ తరువాత ఎం జరిగింది? జార్జ్ నిజంగా స్వలింగ సంపర్కుడా? కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్‌డ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: