సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం వల్ల ఈసినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమా ఫిబ్రవరి 9కు వెళ్లింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టికెటే కొనకుండా అనే పాటను రిలీజ్ చేయగా ఆపాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సెంకడ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. డీజే టిల్లు సినిమాలో రాధిక పేరు ఎంత పాపులర్ అయిందో తెలిసిందే కదా. ఇప్పుడు ఈ పేరుతోనే ఈ సీక్వెల్ లో సాంగ్ వస్తుంది. ఇప్పటికే ఈపాట ప్రోమోను రిలీజ్ చేయగా ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. చూస్తే.. రింగులా జుట్టు చూసి పడిపోయానే బొంగులా మాటలిని పడిపోయానే.. రంగుల కొంగు తాకి పడిపోయానే.. నీ గాలి సోకి నేను సచ్చిపోయానే రాధిక అంటూ వచ్చే ఈపాట ఫుల్ పార్టీ సాంగ్ లా ఉంది. ఈపాట కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకునేలా ఉంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకు రామ్ మిరియాల పాడటమే కాకుండా సంగీతం అందించాడు.
To whomsoever it may concern, Thank you to all our Radhika’s! 😜
Here’s the most energetic beat of the year, #Radhika from #TilluSquare 🕺
🎹 & 🎤 @ram_miriyala
✍️ @LyricsShyam #Siddu @anupamahere @MallikRam99 @achurajamani @NavinNooli #SaiPrakash… pic.twitter.com/CFnNfbnB84— Sithara Entertainments (@SitharaEnts) November 27, 2023
కాగా ఈసినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా.. ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: