బాలకృష్ణ హిందీ డైలాగ్స్‌కి ఫిదా అయిన రణబీర్, నెటిజెన్ల ప్రశంసలు

Ranbir Kapoor and Audience Hails Nandamuri Balakrishna’s Hindi Dialogues

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకం. సినిమాలలో ఎంత పెద్ద డైలాగ్ అయినా గుక్కతిప్పుకోకుండా అద్భుతంగా చెప్పడంలో ఆయన శైలే వేరు. గంభీరమైన కంఠంతో నాన్ స్టాప్ గా ఆయన డైలాగ్స్ చెప్తుంటే.. థియేటర్లలో విజిల్స్ వేయని అభిమానులు ఉండరు. భాష తెలియనివారు సైతం బాలయ్య డైలాగ్స్ చూస్తే క్లాప్స్ కొడతారంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన తెలుగులోనే కాదు.. హిందీలోనూ తన డైలాగ్స్ తో అదరగొడుతున్నారు. బాలయ్య ట్యాలెంట్ చూసి బాలీవుడ్ స్టార్ హీరో సైతం అచ్చెరువొందారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఆయన ఎంత కమాండ్ తో హిందీలో డైలాగ్స్ చెప్పారో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివరాల్లోకి వెళ్తే.. తాజాగా బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ షోలో ‘యానిమల్’ టీమ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ షోకి హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా.. బాలయ్య హిందీ కల్ట్ సినిమా ‘మొఘల్ ఏ ఆజమ్’ సినిమాలోని డైలాగ్స్ అలవోకగా చెప్పేశారు. దీంతో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ షాక్ అయ్యారు. అలాగే బాలయ్య లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూసి ‘భగవంత్ కేసరి’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ లో ఆయన తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ ట్రైలర్ చూసిన రణ్‌బీర్.. ఇది తెలుగు సినిమాలా లేదని, డైరెక్ట్ హిందీ మూవీ చూస్తున్న ఫీల్ కలిగిందని కితాబిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై బాలయ్య అభిమానులే కాకుండా నెటిజెన్లు సైతం బాలయ్యను ప్రశంసిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్‌డ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =