ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న కళ్యాణ్ రామ్ ఆతరువాత అమిగోస్ సినిమాతో వచ్చాడు. అయితే ఆసినిమా మంచి విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరికళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, మాయ చేశావే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేశారు. దిస్ ఈజ్ లేజీ రోజ్ అంటూ వచ్చే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటకే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసాంగ్ ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేయగా ప్రోమో బాగానే ఆకట్టుకుంది. తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈపాటను సింగర్ ర్యాపర్ అయిన రాజకుమారి పాడటం విశేషం. పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యాన్ని అందించగా రాజకుమార్ ఆలపించారు. బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ ఈ పాటలో నటించగా.. తన గ్లామర్, డాన్స్ మూమెంట్స్ కూడా పాటకు ప్రధాన ఆకర్షణ అయ్యేలా కనిపిస్తున్నాయి.
The sizzling song of the year is in full bloom and ready to raise the temperature!https://t.co/BsJ33IQchj#ThisIsLadyRosy from #DevilMovie out now!#Devil – The British Secret Agent
డెవిల్ – डेविल – டெவில் – ಡೆವಿಲ್ – ഡെവിൽ@NANDAMURIKALYAN @iamsamyuktha_
Directed &… pic.twitter.com/G84r40FSA1— ABHISHEK PICTURES (@AbhishekPicture) November 27, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: