కెజియఫ్ 1&2 తరువాత కన్నడ ఇండస్ట్రీ నుండి ఆ లెవెల్లో హిట్ అయినా కన్నడ సినిమా కాంతార.గత ఏడాది ఏమాత్రం హడావిడి లేకుండా విడుదలైన ఈసినిమా 500కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.కేవలం 20కోట్ల బడ్జెట్ లో తెరకెక్కగా అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. తెలుగులో అయితే ఈసినిమా 30కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.కెజియఫ్ 2 తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో కన్నడ సినిమాకూడా ఇదే.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 పేరుతో వస్తున్న ఈసినిమాను కాంతార లో హీరోగా నటించి డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి ఇందులోకూడా హీరోగా చేస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు ఈసినిమా ఫస్ట్ లుక్ తోపాటు టీజర్ ను విడుదలచేశారు.ఫస్ట్ లుక్ లో రిషబ్ శెట్టి డివైన్ లుక్ లో కనిపించగా టీజర్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వుంది.ఈసినిమాను ఏకంగా 7భాషల్లో విడుదలచేస్తున్నారు.దక్షిణాది భాషలతోపాటు హిందీ,బెంగాలీ,ఇంగ్లీష్ లో కూడా విడుదలకానుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
Step into the land of the divine 🔥
Presenting #KantaraChapter1 First Look & #Kantara1Teaser in 7 languages❤️🔥
▶️ https://t.co/GFZnkCg4BZ#Kantara1FirstLook #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @AJANEESHB @Banglan16034849 @KantaraFilm pic.twitter.com/2GmVyrdLFK
— Hombale Films (@hombalefilms) November 27, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: