అ!, కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. సూపర్ హీరోస్ నేపథ్యంలో తేజ సజ్జా హీరోగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ రేసులో దిగనుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను అలానే హనుమాన్ చాలీసా ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గానే రిలీజ్ వరకూ ప్రతి మంగళవారం ఈసినిమా నుండి అప్ డేట్ ఇస్తామని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఈనేపథ్యంలోనే పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. గత మంగళవారం సూపర్ హీరో హనుమాన్ అంటూ పాటను రిలీజ్ చేయగా ఆపాటకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు మంగళవారం కావడంతో ఈసినిమా మూడో సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నవంబర్ 28వ తేదీన మూడో పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
#HanumanTuesday Update is here!
After the two captivating songs, gear up for the 3rd Single on 28th NOV 🎶
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123#HANUMAN from JAN 12th,2024💥@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @anudeepdev @Primeshowtweets… pic.twitter.com/L3OOKWf7U6— Primeshow Entertainment (@Primeshowtweets) November 21, 2023
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: