సంపూర్ణేష్ బాబు హీరోగా పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో వచ్చిన సినిమా మార్టిన్ లూథర్ కింగ్. ఈసినిమా తమిళ్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన మండేలా సినిమాను రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ వారు సొంతం చేసుకున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమాను 29 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారింగా ప్రకటించారు. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేసేయండి.
Watch #MartinLutherKing only on #SonyLIV from November 29th ! https://t.co/vP2PKgkoAs
— Y Not Studios (@StudiosYNot) November 21, 2023
కాగా ఈసినిమాలో నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాను వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్, ఏపీఐ ఫిల్మ్స్ పతాకాలపై ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, శిబాశిష్ సర్కార్, ఎల్. వేణుగోపాల్ తదితరులు సంయుక్తంగా నిర్మించారు. స్మరణ్ సాయిసాంగ్ సంగీతం అందించిన ఈసినిమాకు కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: