బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ వైలెంట్ యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ముందు సందీప్ వంగా షాహిద్ కపూర్‌తో చేసిన ‘కబీర్ సింగ్’ సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకోవడంతో దీనిపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. కాగా ‘యానిమల్’ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. అప్పుడప్పుడు సినిమాకి సంబంధించి కీలక అప్‌డేట్స్ వెల్లడిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘అమ్మాయి’ మరియు ‘నే వేరే’ అనే పాటలు మ్యూజికల్ హిట్ అయ్యాయి. కాగా నెక్స్ట్ అప్‌డేట్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఈ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘నాన్నా నువ్వు నా ప్రాణం’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ను ఈ రోజు విడుదల చేశారు. హిందీ సహా తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో వేర్వేరుగా ఈ పాటను రిలీజ్ చేశారు. ఇక ఈ పాటకు టాలీవుడ్ ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్ ఆలపించారు.
‘నాన్నా నువ్వు నా ప్రాణం’ సాంగ్ ఎలా ఉందంటే..?
ఈ పాటలో ముఖ్యంగా తండ్రీ, కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించారు దర్శకుడు సందీప్ రెడ్డి. చిన్నప్పటినుంచీ తండ్రినే రోల్ మోడల్ గా తీసుకున్న తనయుడికి.. అలాగే వృత్తిరీత్యా బిజీగా గడుపుతూ కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేని తండ్రికి మధ్య ఉండే అంతరాన్ని చక్కగా చూపించారు. ఇంకా తిరిగి చూసేలోపు జీవితంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోవడం, వృధాప్యంలో ఉన్న తండ్రికి అండగా కొడుకు నిలబడటం వంటి సున్నితమైన అంశాలను హృద్యంగా చూపించారు. ఈ సందర్భంగా రణబీర్ కపూర్, అనిల్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఇంటెన్స్ గా ఉండి కట్టిపడేస్తున్నాయి. అయితే తొలినుంచీ ఈ సినిమాను యాక్షన్ మూవీగా ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ.. ఇన్నర్ సోల్ గా ఇందులో మంచి ఫ్యామిలీ స్టోరీ కూడా ఉందని దీనిని బట్టి అర్ధమవుతోంది.
కాగా ‘యానిమల్’ చిత్రాన్ని టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ సినిమా తెలుగు హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకి చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ హైప్ క్రియేట్ అయింది. ఇక ఇటీవలే రణబీర్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా.. మేకర్స్ ‘యానిమల్’ సినిమా తెలుగు టీజర్ రిలీజ్ చేయగా అద్భుత స్పందన వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1న ‘యానిమల్’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: