లోకనాయకుడు కమల్ హాసల్ మాత్రం వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. అందులో థగ్ లైఫ్ సినిమా కూడా ఒకటి ఉంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. మణిరత్నం, కమల్ నుంచి వస్తున్నా రెండో సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఈసినిమా అయితే ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు అప్పుడప్పుడు ఈసినిమా నుండి అప్ డేట్లను ఇస్తూ వస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మాసివ్ అప్ డేట్ తో వస్తున్నట్టు గత రెండు రోజులుగా అప్ డేట్లు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమాలో శింబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఓ పోలీస్ కారులో గన్తో షూట్ చేస్తున్నట్టు ఉన్నశింబు ఫస్ట్ లుక్ అయితే ఆకట్టుకుంటుంది.
In the Realms of Dust, a New Thug Arises!
STR @SilambarasanTR_ makes his Mark➡️ https://t.co/ebMfgpIOch#Ulaganayagan #KamalHaasan #ThugLife #NewThugInTown #SilambarasanTR@ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @trishtrashers @abhiramiact #Nasser… pic.twitter.com/ot4edF66uq
— Raaj Kamal Films International (@RKFI) May 8, 2024
కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ కూడా నటిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: