విష్ణు మంచు నుండి రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా కన్నప్ప. శివుడి భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా ఎక్కువ షూటింగ్ న్యూజిలాండ్ లోనే జరుపుతున్నారు. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు. ఇటీవలే అక్షయ్ కుమార్ కూడా షూటింగ్ లో పాల్గొని తన పోర్షన్ ను పూర్తి చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇంతవరకూ తనకు సంబంధించిన అప్ డేట్ అయితే రాలేదు. ఇప్పుడు తాజాగా ఒక సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చాడు విష్ణు. ఈసినిమా షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అయినట్టు తన సోషల్ మీడియా ద్వారా పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపాడు. దీంతో ఇప్పుడు ఈవార్త వైరల్ గా మారింది. అంతేకాదు ఈసినిమాలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడా అన్న క్యూరియాసిటీ కూడా పెరిగిపోయింది.
My brother joined the shoot #Prabhas#kannappa🏹 pic.twitter.com/WW8WQbBLec
— Vishnu Manchu (@iVishnuManchu) May 9, 2024
కాగా ఈసినిమాలో నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాతోనే మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ విష్ణు తనయుడు అవ్రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: