భజే వాయు వేగం- సెట్ అయ్యిందే మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్

Bhaje Vaayu Vegam Movie First Single set Ayyindhe song promo out

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా భజే వాయి వేగం. ఫాదర్ సెంటిమెంట్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. సెట్ అయ్యిందే అంటూ వచ్చే ఈపాట ప్రోమో ఆకట్టుకుంటుంది. ప్రోమో ను చూస్తుంటే పాట మొత్తం ఫుల్ మాస్ బీట్ తో ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన పాటను రంజిత్ గోవింద్ ఆలపించారు.

కాాగా ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ హ్యాపీడేస్ రాహుల్ టైసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్, సంగీతం రధన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − six =