గిరీష్ దర్శకత్వంలో మమితా బైజు, నస్లేన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ప్రేమలు. మలయాళంలో వచ్చిన ప్రేమలు సినిమా అక్కడ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. దాదాపు 135కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఈసినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా సీక్వెల్ కూడా వచ్చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఓటీటీ సంస్థ అయిన ఆహా లో ఈసినిమా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఏప్రిల్ 12వ తేదీన ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ ఈసినిమా 125 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది.
కాగా ఈసినిమాలో ఇంకా అల్తాఫ్ సలీం,మీనాక్షి రవీంద్రన్,అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈసినిమాకు సంగీతం..విష్ణు విజయ్, సినిమాటోగ్రఫి.. అజ్మల్ సాంబు అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: