న్యాచురల్ స్టార్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకోగా.. ఇప్పుడు ఏడాది చివరిలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా హాయ్ నాన్న. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ కానుంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ కాకముందే మరో సినిమా షూటింగ్ తో బిజీ అయిపోయాడు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈసినిమాను ఇటీవలే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సరిపోదా శనివారం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక గ్లింప్స్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టినట్టు తెలిపారు. ఒక యాక్షన్ ఎపిసోడ్ తో షూటింగ్ ను మొదలుపెట్టినట్టు మేకర్స్ అధికారికంగా తెలియచేశారు.
We started the shoot of #SaripodhaaSanivaaram today with an action episode 🔥🔥 pic.twitter.com/wqi6wyK4Rw
— DVV Entertainment (@DVVMovies) November 13, 2023
కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రోల నటిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































