కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒక్క భాషలో కాదు పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా రాయన్ కూడా ఒకటి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. జూన్ లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఆదిశగానే షూటింగ్ ను పూర్తిచేస్తున్నారు. మరోవైపు ఈసినిమా నుండి అప్ డేట్లు ఇస్తూ మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. చెప్పినట్టే తలవంచి ఎరగడే అన్న ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈసాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
#AdangaathaAsuran oda aattam aarambam! 🔥 #RaayanFirstSingle out now
▶️ https://t.co/6HTN06vcZD#Raayan in cinemas from June 2024!@dhanushkraja @arrahman @PDdancing @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2… pic.twitter.com/627G40cokx
— Sun Pictures (@sunpictures) May 9, 2024
కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్ డీవోపీగా అలానే యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: