హనుమాన్ థియేటర్లలోనే కాదు టీవీ ప్రీమియర్ లో కూడా సత్తా చాటింది.రీసెంట్ గా జీ తెలుగులో మొదటిసారి టెలికాస్ట్ అయిన ఈసినిమా 10.26 రేటింగ్స్ ను రాబట్టింది.దాంతో ఈఏడాది సెకండ్ హైయెస్ట్ టీఆర్పీ మూవీ గా నిలిచింది. ఈ జాబితాలో ఆదికేశవ 10.47 రేటింగ్స్ మొదటి స్థానం లో వుంది.స్టార్ హీరోల సినిమాలు గుంటూరు కారం, సలార్ కూడా వీటిని బీట్ చేయలేకపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ దాదాపు 300కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బయ్యర్లకు భారీ లాభాలను అందించడం తో పాటు ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.ప్రశాంత్ వర్మ ఈసినిమాను డైరెక్ట్ చేయగా తేజ సజ్జా హీరోగా నటించాడు.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు.
హనుమాన్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ కావడంతో దీనికి సీక్వెల్ కూడా రానుంది. జై హనుమాన్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈసినిమా ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.తెలుగుతోపాటు హిందీలోకూడా ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి.భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కించనున్నాడు ప్రశాంత్ వర్మ. వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: