బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ వైలెంట్ యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ముందు సందీప్ వంగా షాహిద్ కపూర్‌తో చేసిన ‘కబీర్ సింగ్’ సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకోవడంతో దీనిపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. కాగా ‘యానిమల్’ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముఖ్య పాత్రలో కనిపించనుండగా.. మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిసెంబర్ 1న ‘యానిమల్’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు సినిమాకి సంబంధించి కీలక అప్‌డేట్స్ వెల్లడిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ అప్‌డేట్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. ‘యానిమల్’ ఫస్ట్ సాంగ్ ను బుధవారం (అక్టోబర్ 11, 2023) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. హిందీ సహా తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో వేర్వేరుగా ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. సో.. ఫ్యాన్స్ గెట్ రెడీ.. రేపు ‘యానిమల్’ ఫస్ట్ సింగిల్ చూడటానికి సిద్ధంగా ఉండండి.
The #Animal 1st Single Releasing tomorrow 🎶 ❤️#HuaMain #Ammayi #Neevaadi #OhBhaale #Pennaale
Music by @jam8studio 🎼#Animal1stSong#AnimalTheFilm #AnimalOn1stDec@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar… pic.twitter.com/xpZkQfCaMb
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 10, 2023
కాగా ‘యానిమల్’ చిత్రాన్ని టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ సినిమా తెలుగు హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకి చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవలే రణబీర్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా.. మేకర్స్ ‘యానిమల్’ సినిమా తెలుగు టీజర్ రిలీజ్ చేయగా అద్భుత స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























