డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో చూశాం. పూరీ డైలాగ్స్ కు రామ్ నటన తోడవ్వడం దానికిి తోడు మ్యూజిక్ కూడా కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఈమధ్య ఈసినిమాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని.. సినిమా ఆగిపోయిందన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ తాజాగా పూరీ ఈసినిమా కొత్త షెడ్యూల్ కు సంబంధించిన అప్ డేట్ అయితే ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమా టీజర్ ను మే15వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. అంతేకాదు ప్రస్తుతం టీజర్ కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి.. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా ఈసినిమా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: