భజే వాయు వేగం రిలీజ్ డేట్ ఫిక్స్

bhaje vaayu vegam movie release date fixed

యంగ్ హీరో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా భజే వాయి వేగం. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేేశారు. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలోభాగంగానే ఫస్ట్ సింగిల్ సెట్ అయ్యిందే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ బీట్ తో ఉన్న ఈ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ తో వచ్చాడు. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మే 31వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మరి ఈసనిమా అయినా కార్తికేయకు మంచి హిట్ ఇస్తుందో?లేదో? చూద్దాం..

కాాగా ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ హ్యాపీడేస్ రాహుల్ టైసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్, సంగీతం రధన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eight =