విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా తన 12వ సినిమా నుండి అప్డేట్ వస్తుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు.ఈసినిమా నుండి ఎలాంటి అప్డేట్ ను మేకర్స్ రివీల్ చేయలేదు. అయితే ఈసినిమా చాలా ప్రత్యేకం అని ప్రస్తుతం భారీ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని త్వరలోనే మీకు నచ్చే అప్డేట్ తో వస్తాం అని ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది మూవీ టీం.ఈసినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విజయ్ దేవరకొండ తన రూట్ మార్చుకున్నాడు.వరుసగా ఖుషి ,ది ఫ్యామిలీ స్టార్ లతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లను చేసిన తను నెక్స్ట్ సినిమాలను వేరు వేరు జోనర్ల లో చేస్తున్నాడు.అందులో భాగంగా విజయ్ -గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వస్తుంది.
ఇక ఈసినిమా తరువాత రవికిరణ్ కోలా తో విజయ్ సినిమా చేయనున్నాడు.ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.కెరీర్ లో విజయ్ మొదటిసారి మాస్ రోల్ లో కనిపించునున్నాడు.దిల్ రాజు -శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈసినిమా కాకుండా విజయ్, రాహుల్ సాంకృత్యాన్ తో తన 14వ సినిమా చేయనున్నాడు.ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీ గా వస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























