దాసరిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన బాలకృష్ణ

Bhagavanth Kesari Success Meet Balakrishna Remembers Director Dasari Narayanarao

టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్ ప్లే చేశారు. కాగా ‘భగవంత్ కేసరి’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో ‘భగవంత్ కేసరి’ సక్సెస్ మీట్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించగా.. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు మరియు నిర్మాత అంబికా కృష్ణ ప్రత్యేక అతిథులుగా హాజరై చిత్ర బృందానికి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఈ చిత్రానికి పనిచేసిన వారందరినీ మీ ముందు సన్మానించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మా నాన్నగారితో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు గారు రావడంతో ఈ కార్యక్రమానికి ఒక నిండుదనం వచ్చింది. అయితే ఈరోజు ఇక్కడ దర్శకరత్న దాసరి కూడా ఉండి ఉంటే బాగుండేది. ఆయన లేని లోటు తెలుస్తోంది. దాసరి చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉండేవారు. ఎవరికీ ఏ సమస్య వచ్చినా అండగా ఉండటమే కాకుండా ఇండస్ట్రీకి తలలో నాలుకలా ఉండేవారు” అని పేర్కొన్నారు.

బాలకృష్ణ ఇంకా ఇలా అన్నారు.. “ఒక మంచి చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పట్టడానికి మించిన సంపాదన, సంతోషం జీవితంలో మరేది లేదన్నది ఎన్నో సందర్భాల్లో నేను అనుభవించాను. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లారీ డ్రైవర్, మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దలా మావయ్య, భైరవద్వీపం, ఆదిత్య 369, లెజెండ్, సింహ, అఖండ, వీరసింహారెడ్డి.. ఇవాళ భగవంత్ కేసరి.. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసే అదృష్టం దొరికింది. మూడు తరాల ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు, అభినందిస్తున్నారంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రయోగాత్మక సినిమాలు, వైవిధ్యభరిత పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం నాన్నగారి నుంచి నాకొచ్చింది. మంచి కథలను పరిచయం చేస్తే విజయం తప్పక వరిస్తుందనడానికి ‘భగవంత్‌ కేసరి’ ఓ నిదర్శనం. నా సినిమాలతో నా సినిమాలకే పోటీ. దర్శకుడు, రచయితలు, నటీనటులు, టెక్నీషియన్ల టీమ్ వర్క్ వల్లే ఈ విజయం సాధ్యమైంది” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్‌ కేసరి’ వంటి సినిమాలు నాకు ఛాలెంజింగ్‌గా నిలిచాయి. ప్రయోగాత్మక చిత్రాల్లో, వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకాన్ని మా నాన్నగారు నాకు ఇచ్చారు. ప్రేక్షకులు సక్సెస్‌ని అడగకముందే మంచి కథలు పరిచయమవుతాయనడానికి ‘భగవంత్ కేసరి’ నిదర్శనం. ప్రజలకు ఒక మంచి సందేశాన్ని అందించడానికి సినిమాని మించిన మాధ్యమం లేదు. అయితే కొందరు చెబితేనే విషయం ప్రజల్లోకి వెళుతుంది. ఈ సినిమాలో ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది. కాజల్ అగర్వాల్, శ్రీలీల .. ఇలా అందరూ అద్భుతంగా నటించారు. అర్జున్ రామ్ పాల్ చాలా కసిగా ఈ పాత్ర చేశారు. ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పడం అభినందనీయం. శరత్ కుమార్ గారు చేసింది చిన్న పాత్రే అయినా సినిమాకి ఒక శుభారంభం దొరికింది. దర్శకుడు అనిల్‌కి మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ‘భగవంత్ కేసరి’ హిందీలోనూ విడుదల కానుంది. నా పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పాను. బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. అందులో బ్లడ్ బాత్ బ్రాండ్ ఎలా ఉండబోతుందో చూస్తారు.” అని బాలకృష్ణ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =