8000 ఆర్టిస్టులతో ఇండియన్ 2 షూట్

indian 2 movie new schedule update

లోకనాయకుడు కమల్ మాత్రం ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇండియన్ 2, కల్కి2898ఏడీ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా రీసెంట్ గానే మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న థగ్ లైఫ్ సినిమాను కూడా మొదలుపెట్టాడు. ఇవి కాకండా ఇంకా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో అలానే హెచ్.వినోథ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇన్ని రోజులు ఇండియన్ 2 షూట్ కు బ్రేక్ ఇవ్వగా తాజాగా ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. విజయవాడలో ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే దాదాపు 8000 మంది ఆర్టిస్టులు ఈషూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. నాలుగు రోజుల పాటు అక్కడే షూటింగ్ ను జరుపుకోనుందట.. ఆ తరువాత వైజాగ్ లో షూటింగ్ జరపనున్నారట.

ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, సుభాస్కరన్‌ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =