కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. జిగర్ తండ డబుల్ ఎక్స్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో లారెన్స్,ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది అనే చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈలోపు ఈసినిమాపై తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన రివ్యూను ఇచ్చేశారు. ఈసినిమాను చూసిన ధనష్ తన ట్విట్టర్ ద్వారా జిగర్ తండ డబల్ ఎక్స్ చూశాను..డైెరెక్టర్ సుబ్బరాజు చాలా అద్భుతంగా తెరకెక్కించారు..ఈ మూవీలో కూడా మరోసారి తన మార్క్ పెర్ఫార్మన్స్ తో ఎస్ జె సూర్య చాలా బాగా చేశాడు.. రాఘవ లారెన్స్ కూడా అద్భుతంగా నటించాడ.. సంతోష్ నారాయణన్ సంగీతం కూడా ఎంతో బాగుంది.. సినిమా చివరి 40 నిమిషాలు మీ మనసులను దోచుకుంటుందని తెలిపాడు. ధనుష్ ట్వీట్ తో సినిమాపై మరింత పాజిటివ్ బజ్ పెరిగింది.
Watched jigarthandaxx. Fantastic craft from @karthiksubbaraj, being amazing has become an usual deal for @iam_SJSuryah. As a performer @offl_Lawrence is a revelation. @Music_Santhosh u r a beauty. The last 40 mins of d film steals your heart. All the best to the crew and cast.
— Dhanush (@dhanushkraja) November 9, 2023
కాగా స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. తిరునవుక్కరుసు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సురేష్ ప్రొడక్షన్స్తోపాటు ఏషియన్ సినిమాస్ కలిసి విడుదల చేశారు. ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: