బిగ్ బాస్7 హౌస్ లో చూస్తుండగానే 9 వారాలు పూర్తయిపోయి పదో వారంలోకి అడుగుపెట్టారు. ఇక తొమ్మిదో వారంలో టెస్టీ తేజా ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం అయితే హౌస్ లో 10మంది ఉన్నారు. ఇక సోమవారం ఎపిసోడ్ మొదలైపోయింది. శివాజీ మీద ఇంకా కోపంతోనే ఉన్నాడు గౌతమ్. శివాజీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలంటూ అర్జున్ చెబుతుంటాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు సోమవారం ఎలిమినేషన్ ప్రాసెన్ ను మొదలుపెడతాడు బిగ్ బాస్. ఈసారి బిగ్ బాస్ మహారాజ్యంలో నామినేషన్స్ జరుగుతాయని.. అశ్విని, ప్రియాంక, రతిక, శోభా రాజమాతలుగా ఉంటారని.. వారు శంఖారావం పూరించిన ప్రతిసారి ఇద్దరు హౌస్ మేట్స్ వచ్చి తమ వాదనలు వినిపించాలని చెప్పాడు. ఇక ఆ ఇద్దరి వాదనలో ఎవరి వాదనలు కరెక్ట్ అనిపిస్తాయో ఆ వ్యక్తి నామినేట్ అవుతాడు.
ఇందులో ముందుగా అర్జున్, అమర్ తమ కత్తులను అందుకొని అమర్ భోలే ను నామినేట్ చేస్తూ వేరే టీమ్ వాళ్లు మిమ్మల్ని వీక్ కంటెస్టెంట్ అని పక్క టీమ్ కు పంపిస్తున్నప్పుడు ఏం మాట్లాడకుండా రావడం నచ్చలేదని రీజన్ చెప్పాడు. మరోవైపు అర్జున్.. వేరే వాళ్లు చెప్పింది విని శివాజీ గారిని అపార్థం చేసుకోవడం నచ్చలేదంటూ రీజన్ చెబుతాడు. ఇక వీరిద్దరిలో అమర్ నామినేషన్ వ్యాలిడ్ గా ఉందంటూ భోలేని నామినేట్ చేస్తారు. ఆ తరువాత ప్రిన్స్ అమర్ ను, ప్రశాంత్ గౌతమ్ ను నామినేట్ చేయగా ఇద్దరిలో ప్రశాంత్ నామినేషన్ కు మద్దతు పలుకుతూ గౌతమ్ ను నామినేట్ చేస్తారు.
అనంతరం భోలే అమర్ ను, గౌతమ్ శివాజీ ని నానినేట్ చేయగా గౌతమ్ కు మద్దతు తెలుపుతూ శివాజీని నామినేట్ చేస్తారు. అయితే ఇక్కడ శివాజీ కాస్త ఫైర్ అవుతాడు. నేను తప్పుడు బిడ్డనైతే నన్ను ఎలిమినేట్ చేయండి అంటూ ఆగ్రహిస్తాడు. ఆ తరువాత మళ్లీ ప్రిన్స్, శివాజీ కత్తులు పట్టుకొని శివాజీ అమర్ ను ప్రిన్స్ కూడా అమర్ ను నామినేట్ చేస్తారు. అయితే ఇద్దరూ ఒకరినే నామినేట్ చేయకూడదని.. లేకపోతే సెల్ఫ్ నామినేషన్ వేసుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో ప్రిన్స్ సెల్ఫ్ నామినేషన్ వేసుకుంటాడు.
నామినేషన్ పూర్తయిన తరువాత రాజమాతలకు మరో ట్విస్ట్ ఇస్తాడు. నలుగురు ఏకాభిప్రాయంతో ఒకరిని నామినేట్ చేయాలని చెప్పగా.. వీరిలో అశ్విని, రతిక ప్రియాంక పేరు చెప్పగా.. ప్రియాంక, శోభా రతిక పేరు చెబుతారు. ఫైనల్ గా కెప్టెన్ గా ఉన్న శోభా ని డిసైడ్ చేయమని చెప్పగా రతికను నామినేట్ చేస్తుంది. రతిక పేరు చెప్పడంతో శోభాకు, రతికకు పెద్ద గొడవనే జరుగుతుంది. ఫైనల్ గా ఈవారం ప్రిన్స్, గౌతమ్, శివాజీ, భోలే, రతిక నామినేషన్స్ లోకి వచ్చారు. మరి ఈవారం ఎవరు హౌస్ ను వీడతారో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: