మరో 150 రోజుల్లో రానున్న దేవర

devara movie team starts count down

ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. శివ కొరటాల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే అండర్ వాటర్ సీక్వెన్స్, కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్, నైట్ సీక్వెన్స్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే గోవా వెళ్లిన చిత్రయూనిట్ అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమా రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ఈ విషయాన్ని గుర్తుచేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇంకా ఈసినిమా 150 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపారు. మరి ఈసినిమా చూడాలంట్ సమ్మర్ వరకూ ఆగాల్సిందే.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 19 =