గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలే చేయగలరని పేర్కొన్నారు కోలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. ఆర్‌సీ15గా వస్తోన్న ఈ చిత్రానికి ఆయన కథను అందించడం విశేషం. కాగా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘వినయ విధేయ రామ’ తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా కావడం గమనార్హం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా సుబ్బరాజ్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. “గేమ్ ఛేంజర్ ఒక పొలిటికల్ స్టోరీ. ఇందులో చాలా రాజకీయాలు ఇమిడి ఉన్నాయి. శంకర్ సార్ నన్ను కథ కోసం సంప్రదించకముందే నేను రాశాను. గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను పెద్ద హీరో మాత్రమే చేయాలి. అలాగే శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ మాత్రమే ఇలాంటి స్క్రిప్ట్‌ని టేకప్ చేయగలరు. ఇదే విషయాన్ని నా టీమ్‌కి కూడా చెప్పాను. అయితే నాకు రాజకీయాల్లోకి రావడంపై ఎలాంటి ఆసక్తి లేదు” అని సుబ్బరాజ్ తెలిపారు.
#GameChanger Script Demands a Big Hero & a Director like Shankar to Take it up. Too Much Politics is Involved – #KarthikSubbaraj pic.twitter.com/vvHeGMvT4l
— Raees (@RaeesRC_) November 7, 2023
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “గేమ్ ఛేంజర్ ప్లాట్‌కు భారీ స్థాయి డిమాండ్ ఉంది. శంకర్ సర్ లాంటి వారు మాత్రమే ఆ ప్లాట్‌కు న్యాయం చేయగలరు. ఇది కంప్లీట్ శంకర్ జోన్‌లో ఉంటుంది. ‘గేమ్ ఛేంజర్’ శంకర్ సర్ స్టైల్‌లో సాగే పర్‌ఫెక్ట్ సినిమా అవుతుంది” అని పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి మేకర్స్ తొలి సాంగ్‌ను విడుదల చేయనున్నారు. దీపావళి సందర్బంగా రిలీజ్ చేయనున్న ఈ సాంగ్ సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతున్నట్లు టాక్. ‘జరగండి’ అంటూ సాగే ఈ పాట కోసం డైరెక్టర్ శంకర్ కోట్లాది రూపాయలతో భారీ సెట్స్ వేయించినట్లు సమాచారం. కాగా సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు.
పొలిటికల్ జోనర్‌లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. ప్రముఖ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్, ‘రోబో’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: