అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలయ్య యాక్టింగ్, శ్రీలీల తో వచ్చే ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. ఇక ఈసినిమా విజయతో బాలయ్యకు హ్యాట్రిక్ అందించడంతో పాటు అనిల్ ఖాతాలో మరో హిట్ చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమాపై గోపీచంద్ మలినేని తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి.. బాలయ్య గారు ఫైర్ లా నటించారు. తను ఉన్న ప్రతి ఫ్రేమ్ నాకు ఎంతో నచ్చింది.. బ్రదర్ అనిల్ రావిపూడి సక్సెక్ కొట్టాడు.. ఇంకా బావ థమన్ మంచి మ్యూజిక్ అందించాడు.. శ్రీలీల గ్రేట్ జాబ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా బాలకృష్ణతో గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమా తీసిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఈఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సైతం అందుకుంది.
Blockbuster #BhagavanthKesari 👌👌
Balayya garu is on 🔥🔥
Loved him in every frame 😍
My brother @AnilRavipudi excelled the show & @MusicThaman bava is full on high with his work., well done @sreeleela14. 🙌💥💥Big big congratulations to everyone involved. ❤️@MsKajalAggarwal…
— Gopichandh Malineni (@megopichand) October 19, 2023
కాగా కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలల మరో కీలక పాత్రలో నటించింది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈసినిమాకు
సినిమాటోగ్రఫి.. సి.రామ్ ప్రసాద్, సంగీతం.. ఎస్ థమన్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: