మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఈసినిమా వచ్చింది. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా మొదటినుండే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఆ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. దీంతో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా మూడు హిట్లు కొట్టి హ్యాట్రిక్ అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాకు అనిల్ రావిపూడి కథ ఇంకా బాలకృష్ణను కాస్త కొత్తగా చూపించడం.. మరోవైపు బాలకృష్ణ-శ్రీలీల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అన్నీ ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయి. దానితో పాటు థమన్ మ్యూజిక్ కూడా ఈ హిట్ లో భాగమైంది. ఇదిలా ఉండగా ఈసినిమా కలెక్షన్స్ కూడా జోరుమీదున్నాయి. ఒక్క రోజులనే ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 32కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. వరల్డ్ వైడ్‌గా సుమారు 1350 థియేటర్లలో 68.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈసినిమా మొదటిరోజే దాదాపు సగం కలెక్షన్స్ రాబట్టుకుంది. ఒక్క నైజాంలోనే ఈసినిమా 4.12 కోట్లను రాబట్టుకుంది. ఇక ఆంధ్రాలో 8 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఒక్క గుంటూరులోనే 3కోట్లకు పైగా కలెక్షన్స్ ను అలానే సీడెడ్ లో 4 కోట్లకు పైగా, కర్ణాటకలో 88 లక్షలు, అలానే ఇతర ప్రాంతాల్లో 88లక్షల కలెక్షన్స్ సొంతం. ఇక వీకెండ్.. మూడు రోజులు పండుగ సందడి ఉంటుంది.. ఈ మూడు రోజుల్లో ఈసినిమా వంద కోట్ల క్లబ్ లో ఈజీగా చేరుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు
కాగా కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలల మరో కీలక పాత్రలో నటించింది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈసినిమాకు
సినిమాటోగ్రఫి.. సి.రామ్ ప్రసాద్, సంగీతం.. ఎస్ థమన్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: