సప్త సాగరాలు దాటి – సైడ్ బి రిలీజ్ డేట్ ఫిక్స్

Sapta Sagaraalu Dhaati Side B Release Date Fixed

‘777చార్లీ’ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ’. ఇక ఈ మూవీలో రక్షిత్‌ శెట్టి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. లవ్ స్టోరీ నేపథ్యం కలిగి ఉండటంతో యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీనికితోడు చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం. ఈ క్రమంలో కన్నడనాట యువతరాన్ని ఉర్రుతలూగించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగులో సెప్టెంబర్ 22న విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ‘సప్త సాగరదాచే ఎల్లో’ రెండు భాగాలుగా రూపొందింది. ఇక తొలి పార్ట్ హిట్ అవ్వడంతో సీక్వెల్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అటు కన్నడ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రెండో పార్ధు విడుదలకు సంబంధించి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ‘సప్త సాగరాలు దాటి – సైడ్ బి’ పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు సదరు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నవంబర్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాను హీరో రక్షిత్‌ శెట్టి తన స్వంత బ్యానర్‌పై నిర్మించడం విశేషం. అలాగే గుండు శెట్టి సహ రచయితగా వ్యవహరించగా.. అద్వైత గురుమూర్తి ఛాయాగ్రహణం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 5 =