యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ లను తీసి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్లు కొట్టడంలో బోయపాటి శ్రీను ఎక్స్ పర్ట్.ఎంత యాక్షన్ వున్న ఫ్యామిలీ సెంటిమెంట్ ను మాత్రం ఎక్కడా మిస్ చేయడు.బోయపాటి రీసెంట్ మూవీ స్కంద కూడా ఇలాంటి సినిమానే.ఇటీవల విడుదలైన ఈసినిమా రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లను సాధించే సినిమాగా దూసుకుపోతుంది.ఇప్పటివరకు 50కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.ఇక ఈసినిమా తరువాత ఈ డైరెక్టర్ తను ఎవరితో సినిమాలు చేయనున్నాడో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో రివీల్ చేశాడు.ప్రస్తుతానికి చేతిలో మూడు ప్రాజెక్టులు వున్నాయి.అందులో అఖండ 2 ఒకటి.దీనితో పాటు అల్లు అర్జున్ అలాగే సూర్యతో సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి.అయితే వీటిలో ఏ సినిమా మొదట పట్టాలెక్కుతుందో మాత్రం చెప్పలేను అని బోయపాటి శ్రీను వెల్లడించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే ప్రస్తుతానికి అల్లు అర్జున్, పుష్ప సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఈసినిమా తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.ఈరెండు కంప్లీట్ అయ్యే సరికి వచ్చే ఏడాది పడుతుంది.సూర్య విషయానికి వస్తే ప్రస్తుతం కంగువలో నటిస్తున్నాడు ఈసినిమా తోపాటు వెట్రిమారన్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. దాంతో సూర్య కూడా వచ్చే ఏడాది చివర్లో కానీ ఫ్రీ అయ్యేలా లేడు.
ఇక బోయపాటి,బాలకృష్ణ తో అఖండ 2కూడా తీయనున్నాడు.అయితే బాలయ్య రీసెంట్ గానే భగవంత్ కేసరి పూర్తి చేశాడు.ఈసినిమా ఈనెల 20న విడుదలకు సిద్దమవుతుంది.భగవంత్ కేసరి తరువాత బాలకృష్ణ, బాబీ తో సినిమా చేయనున్నాడు.సో వచ్చే ఏడాది చివర్లో కానీ బోయపాటి కి స్లాట్ దొరికేలా లేదు.మరి ఈముగ్గురి హీరోల్లో ఎవరు ఫస్ట్ బోయపాటి కి ఆ ఛాన్స్ ఇస్తారో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: