సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగాఉన్నారు మేకర్స్. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా ప్రస్తుతం అందరూ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. నేడు ఇప్పటికే ఈసినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న అర్జున్ రాంపాల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. స్టైలిష్ లుక్ లో ఉన్న అర్జున్ రాంపాల్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో కాజల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో కాత్యాయనిగా నటిస్తుంది కాజల్.
Introducing the multifaceted #KajalAggarwal as #Kathyayani from #BhagavanthKesari 🔥
TRAILER TOMORROW @ 8:16 PM❤️🔥
Massive Release Worldwide on October 19th💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7… pic.twitter.com/TV6CA0wloy
— Telugu FilmNagar (@telugufilmnagar) October 7, 2023
కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: