మచ్ అవైటెడ్ భగవంత్ కేసరి ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచాలను పెంచేసింది.ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు హన్మకొండ లోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది.ఈ ఈవెంట్ కు చిత్ర బృందం తోపాటు డైరెక్టర్లు వంశీ పైడిపల్లి ,గోపిచంద్ మలినేని, బాబీ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈట్రైలర్ ను బాలయ్య -శ్రీ లీల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్ల తో స్టార్ చేసి చివరికి బాలయ్య -అనిల్ రావిపూడి మార్క్ సీన్ తో ముగించేశారు.బాలకృష్ణ డైలాగ్స్ తో పాటు లుక్ కూడా బాగుంది.వీటికి తోడు విజువల్స్ ,తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ష్…. సప్పుడు జెయ్యాక్!
అడవి బిడ్డ…. నేలకొండ భగవంత్ కేసరి వచ్చిండు 💥#BhagavanthKesari TRAILER OUT NOW❤️🔥IN CINEMAS OCT 19th🤘🏻#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7… pic.twitter.com/IEoh19PWw7
— Shine Screens (@Shine_Screens) October 8, 2023
ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.అంతేకాదు ఈసినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతాడని బలంగా నమ్ముతున్నారు.ఇంతకుముందు బాలయ్య ..అఖండ,వీర సింహారెడ్డి లతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ లను ఖాతాలో వేసుకున్నాడు.మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు కూడా బాగుండడంతో భగవంత్ కేసరిఫై ఎవరికి అనుమానులు లేవు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా రైజింగ్ బ్యూటీ శ్రీ లీల బాలయ్య కూతురిగా కనిపించనుంది.బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటించాడు. షైన్ స్క్రీన్స్ ఈ సినిమాను నిర్మించగా ఈదసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: