నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ కమ్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. నాని 30గా వస్తోన్న ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బేబి కైరా ఖన్నా నాని కూతురుగా చేస్తుండగా.. హీరోయిన్ యశ్న పాత్రలో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో.. మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ వీడియో, ‘సమయమా’ అనే సాంగ్‌ను రిలీజ్ చేయగా నెట్టింట వైరల్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా నుంచి ‘గాజు బొమ్మ’ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా దీనిని రిలీజ్ చేశారు. శుక్రవారం ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో ఈ పాటను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన దీనిపై.. “ప్రతీ నాన్న నుంచి కూతురికి, ప్రతీ తండ్రిలో ప్రతిధ్వనించే పాట, హాయ్ నాన్న టీంకి బెస్ట్ విషెస్” అని ట్వీట్ చేశారు. కాగా గాజు బొమ్మ సాంగ్ ఫాథర్ అండ్ డాటర్ బాండింగ్ ను అద్భుతంగా చూపించారు. ఫన్, ఎమోషన్ సన్నివేశాలతో హృద్యంగా సాగిన ఈ పాట ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
From a father to his daughter, a song that will resonate with every dad, just like it did with me ♥️ #GaajuBomma!
Best wishes to the team!! #HiNanna
https://t.co/urBOIxWbip@NameisNani @mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @IananthaSriram @VyraEnts— Mahesh Babu (@urstrulyMahesh) October 6, 2023
కాగా ఈ సినిమాకు సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. ప్రముఖ మలయాళ కంపోజర్, ‘ఖుషి’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే సాను జాన్ వర్గీస్ ఇంతకుముందు నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలకు పనిచేశారు. ఇక ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: