తుది దశలో గేమ్ ఛేంజర్ షూట్

ram charan game changer movie shoot nearing to completion

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెప్టెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ దిశగానే సినిమాను పూర్తి చేస్తున్నారు. ఎప్పటినుండో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేకులు వచ్చినా ఇప్పుడు మాత్రం షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికే ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం అయితే చెన్నైలో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొంటున్నారని సమాచారం.

కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =