అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా పొలిమేర 2. ఈసినిమా పొలిమేర సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. హార్రర్ నేపథ్యంలో మూఢనమ్మకాలు, చేతబడుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈసినిమా ఓటీటీ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. దీంతో ఈసినిమాకు సీక్వెల్ గా పొలిమేర 2 ను తీశారు. ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది జరగనున్న 14వ దాదా సాహెబ్ పాల్కే ఫిలిం ఫెస్టివల్ కు ఈసినిమా ఎంపిక అయింది. ఏప్రిల్ 30వ తేదీన న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో తమ సినిమాకు ఇలాంటి గౌరవం దక్కినందుకు చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఈసినిమాలో డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ, జ్ఞానీ సంగీతం అందించగా.. శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌర్ కృష్ణ నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: