ప్రతినిధి2 టైటిల్ సాంగ్ రిలీజ్

nara rohit prathinidhi 2 movie title song released

నారా రోహిత్ హీరో‌గా జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా ప్రతినిధి2. ఈసినిమా ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. నిజానికి ఏప్రిల్ 25వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ను అయితే ఇంతవరకూ ప్రకటించలేదు. ఎన్నికలు అయిపోయిన తరువాత ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు. ఈసారి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించిన ఈపాటను స్వరాగ్ కీర్తన్, జయంత్ ఆలపించారు.

కాగా ఈసినిమాలో సిరీ లెల్లా హీరోయిన్ గా నటిస్తుండగా.. దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.