కింగ్ నాగార్జున ,ధనుష్ ,శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కుబేర.సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి మేజర్ బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ప్రస్తుతం ముంబై లో కీలక షెడ్యూల్ ను షూట్ చేస్తున్నారు.ఈసినిమా నుండి ఇంతకుముందే ధనుష్ లుక్ ను రివీల్ చేయగా నిన్న, నాగార్జున లుక్ ను కూడా రివీల్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఫస్ట్ లుక్ వీడియో అదిరిపోయింది.ఫార్మల్ లుక్ లో నాగ్ అదరగొట్టాడు.వీడియోలో దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వావ్ అనిపించింది.యూట్యూబ్ లో ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో వుంది.ఇక కేవలం పోస్టర్లతోనే సినిమాకు పాజిటివ్ బజ్ అయితే వచ్చింది.మేకింగ్ పరంగా శేఖర్ కమ్ముల ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈసినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ నిర్మిస్తున్నారు. ఈఏడాది చివర్లో కుబేర పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకులముందకు రానుంది.
ఇదిలావుంటే ఈసంక్రాంతికి నా సామి రంగ తో వచ్చి హిట్ కొట్టిన నాగ్ ప్రస్తుతం కుబేరకు మాత్రమే కమిట్ అయ్యాడు.సోలో హీరోగా అయితే ఇప్పటివరకు మరో సినిమాను ఒప్పుకోలేదు.అయితే ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాడట. త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను లాక్ చేసే ఛాన్స్ వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























