కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ మూవీ రివ్యూ

kiran abbavaram rules ranjann movie review

రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా రూల్స్ రంజన్. ఇక ఈసినిమాలో నేహాశెట్టి కూడా నటించడం, పాటలు బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ వాయిదా పడింది. ఫైనల్లీ ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరోయిన్, హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ తదితరులు
దర్శకత్వం..రత్నం కృష్ణ
బ్యానర్స్.. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు.. దివ్యంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి
సంగీతం.. అమ్రిష్ గణేష్
సినిమాటోగ్రఫి

కథ
మనో రంజన్(కిరణ్ అబ్బవరం) సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. అయితే జీవితంలో మంచి పొజిషన్ లో ఉండాలనుకునే మనో రంజన్ లఫ్ ను ఎంజాయ్ కూడా చేయకుండా కొన్ని రూల్స్ పెట్టుకొని చాలా స్ట్రిక్ట్ గా లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తనకు ముంబై ట్రాన్ఫ్సర్ అవుతుంది. ఇక అక్కడ తనకు సన (నేహా శెట్టి) పరిచయం అవుతుంది. పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది.. ఆమె కోసం తన రూల్స్ ను సైతం పక్కనపెట్టి ఆమెతో తిరుగుతుంటాడు. అయితే కరోజు ఆమెకు అప్పటికే పెళ్లి ఫిక్స్ అవుతుందని తెలుస్తుంది. ఆ తరువాత మనో రంజన్ ఏం చేశాడు..తమ ప్రేమ సక్సెస్ అవుతుందా?లేదా? అన్నది మిగిలిన కథ..

విశ్లేషణ

ఈసినిమా పాయింట్ చెప్పాలంటే పాతదే అయినా కూడా డైరెక్టర్ రత్న కృష్ణ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కామెడీ తో పాటు ఎమోషన్ ను కూడా జోడించి..
ఇంటెన్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా అటు ఎమోషన్ ని, ఇటు కామెడీ ని రెండిటిని బ్యాలెన్స్డ్ చేసుకుంటూ సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఒక ప్రేక్షకుడికి ఎలాంటి సినిమా అయితే కావాలో అలాంటి ఒక కమర్షియల్ సినిమాని అందించాడు.

కిరణ్ అబ్బవరం మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు రూల్స్ రంజన్ అంటూ వచ్చేశాడు. ఇక ఈసినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఎప్పటిలాగే ఈసినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత మెచ్యూర్డ్ గా నటించాడని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. మరో హీరోయిన్ గా నటించిన మెహర్ చావల్ కూడా బాగానే నటించింది. ఈసినిమాకు మరో ప్రధాన బలం ఎవరంటే వెన్నెల కిషోర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన కామెడీతో మరోసారి చెలరేగిపోయాడు. వెన్నెల కిషోర్ తో పాటు హైపర్ ఆది, వైవా హర్ష కూడా బాగానే నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించారు.

సాంకేతిక విభాగానికి వస్తే అమ్రీష్ అందించిన సంగీతం బాగానే ఉంది. ఈసినిమాకు మంచి హైప్ తెచ్చిన సమ్మోహనుడా సాంగ్ మేకింగ్ కూడా చాలా బాగుంది. దిలీప్ కుమార్ అందించిన సినిమాటోగ్రఫి కూడా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గానే ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమా కాబట్టి ఈసినిమా అన్ని వర్గాల వారికీ కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =