ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో డియర్

DeAr Movie is Trending in Top on Netflix

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ కమ్ యాక్టర్ జీవీ ప్రకాష్ కుమార్‌ మరియు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డియర్’. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజయింది. కాగా టాలీవుడ్ స్టార్‌ హీరో అక్కినేని నాగచైతన్య చేతులమీదుగా ‘డియర్‌’ చిత్రం తెలుగు ట్రైలర్‌ విడుదలయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో ‘డియర్’ మూవీ ఏప్రిల్ 28వ తేదీ నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..? థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అయింది. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 3లో ట్రెండింగ్‌ అవుతుండటం విశేషం. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేశారు.

భార్య గురకతో ఒక భర్త ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? దీనివలన వారి వైవాహిక జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? చివరకు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇది ఎక్కడి వరకు వెళ్లింది? అనేది సినిమా కథ. కాగా ‘డియర్’ సినిమాలో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్‌పై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. ఇక ఈ చిత్రానికి హీరో జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా.. జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.