విజయ్ దేవరకొండ కొత్త సినిమా షురూ

Vijay Deverakonda New Movie Announcement

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. ఈ  సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించగా,, ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5న గ్రాండ్‌ రిలీజ్‍ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ రావడంతో అనుకున్నంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుండగా.. తాజాగా విజయ్ దేవరకొండ అప్పుడే కొత్త చిత్రం షురూ చేసాడు. అయితే విశేషమేంటంటే..? ఈ మూవీ కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లోనే రూపొందనుంది. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో 59వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇక దీనికి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు. మే 9వ తేదీన ఈ కొత్త చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెల్లడి కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.