మ్యాడ్ మూవీ రివ్యూ.. కడుపుబ్బా నవ్వించే ఫన్ రోలర్ కోస్టర్

narne nithin mad telugu movie review

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా వస్తున్న సినిమా మ్యాడ్. ఈసినిమాతోనే నితిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఇంకా పాటలు అన్నీ కూడా సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. సినిమా చూడాలి అన్న క్యూరియాసిటీని అయితే పెంచాయి. మరి ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. నార్నె నితిన్, సంగీత్ శోభన్,రామ్ నితిన్, గౌరీ ప్రియా,అనంతిక,గోపిక ఉదయన్, మురళీధర్ గౌడ్,రఘు బాబు,విష్ణు తదితరులు
దర్శకత్వం..కళ్యాణ్ శంకర్
బ్యానర్స్.. సితార ఎంటెర్టైమెంట్స్
నిర్మాతలు.. సూర్యదేవర హారిక
సంగీతం.. భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫి..దినేష్ కృష్ణన్, శ్యామ్ దత్

కథ
మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్) రీజినల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. వీరి ముగ్గురి లైఫ్ లోకి శృతి (శ్రీగౌరిప్రియారెడ్డి), జెన్నీ(అనంతిక‌), రాధ (గోపిక ఉద్యాన్‌) వ‌స్తారు. వీరి ముగ్గురి వల్ల అశోక్‌, మ‌నోజ్‌, దామోద‌ర్ జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి? ఇంజనీరింగ్ ముగిసే సరికి వీరు ముగ్గురు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు..? ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి అన్నది ఈసినిమా కథ.

విశ్లేషణ
కాలేజ్ బ్యాక్ డ్రాప్, గొడవలు, ర్యాగింగ్స్ మధ్యలో లవ్ స్టోరీ ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యాపీ డేస్ అని చెప్పొచ్చు. కానీ ఏ బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నా ఆ నేపథ్యంలో సినిమాలు వచ్చే ఉంటాయి. అయితే మనం కథను ఎంత కొత్తగా చూపిస్తున్నాం.. ఆడియన్స్ ను ఎంత ఎంగేజ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ఆ విషయంలో మ్యాడ్ సినిమా సక్సెస్ అయింది అని చెప్పొచ్చు.

కొన్నిసినిమాలకు లాజిక్స్ కావాలి.. కానీ కొన్ని సినిమాలకు లాజిక్స్ తో పనిలేదు. ఇక రెండో కేటగిరీకి చెందిన సినిమానే మ్యాడ్. రెండు గంటలపాటు హాయిగా నవ్వుకొని వచ్చే సినిమా. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే కథ గురించి చెప్పడం కష్టం. స్క్రీన్ ప్లే అలా వెళ్లి పోతూ ఉంటుంది. కథలోని పాత్రలే కథను నడిపించేస్తుంటాయి.

పెర్ఫామెన్స్
ఇండస్ట్రీలోకి బ్యాక్ గ్రౌండ్ తో ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇస్తుంటారు. అయితే బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఈజీ అవుతుందేమో తప్పా సక్సెస్ అందుకోవాలంటే మాత్రం దానికి హార్డ్ వర్క మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక ఇప్పుడు నార్నె నితిన్ కూడా ఎన్టీఆర్ బావమరిది అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. మొదటి సినిమా అయినా కూాడా చాలా ఈజ్ తో నటించాడు. డ్యాన్సులు కూడా బాగానే చేశాడు. ఇక నితిన్ తో పాటు ఈసినిమాలో చేసిన ప్రధాన పాత్రలందరూ కొత్తవాళ్లే. అయినా కూడా ఆ ఫీల్ ఎక్కడా రాదు. రామ్ నితిన్, సంగీత్ శోభన్ నితిన్ కు మంచి సపోర్ట్ ను ఇచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముగ్గురి పాత్రల్లో ఏ పాత్రనూ తక్కువ చేయలేం. ఇక హీరోయిన్లు గా నటించిన శ్రీగౌరిప్రియారెడ్డి, అనంతిక‌, గోపిక ఉద్యాన్‌ కూడా చాలా చక్కగా నటించారు. ప్రిన్సిపాల్‌గా రఘుబాబు ఇంకా మిగిలిన పాత్రలు తమ పాత్రల మేర బాగా నటించారు.

టెక్నికల్ వాల్యూస్

ఈసినిమా గురించి చెప్పాలంటే ముందుగా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గురించి చెప్పాలి. ఈ సినిమాకు ఇంత మంటి పాజిటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణం తనే కాబట్టి. చాలా సింపుల్ గా కథను రాసుకున్నాడు. ఏదో జనాలకు మెసేజ్ ఇచ్చేయాలి అని కాకుండా.. ఆడియన్స్ ను బిగినింగ్ నుండి ఎండింగ్ వరకూ ఎలా నవ్వించాలి అన్న కాన్సెప్ట్ తోనే ఈకథను రాసుకున్నట్టు కనిపిస్తుంది. కాలేజ్, హాస్టల్ లైఫ్‌లంటే ఇలానే ఉంటాయని డైరెక్టర్ ఎంతో ఫన్నీగా చూపించాడు. కాలేజ్, హాస్టల్ లైఫ్ గడిపిన ప్రతీ ఒక్కరికీ ఖచ్చింగా తమ రోజులు గుర్తుకువస్తాయి. చివరివరకూ కథ, కథనం అలా సాగుతుంది.

ఇక భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం కూడా బాగుంది. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కామెడీ సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలంగా మారింది. పలు సన్నివేశాలు రీరికార్డింగ్‌తో బాగా ఎలివేట్ అయ్యాయి. దినేష్ కృష్ణన్, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి మరో ప్లస్ పాయింట్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాబట్టి నిర్మాణ విలువలకు ఎలాంటి వంక పెట్టాల్సిన పని లేదు.

ఓవరాల్ గా చెప్పాలంటే లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి రెండు గంటలపాటు నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా మ్యాడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఏమో కానీ యూత్ కు మాత్రం ఈసినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + fifteen =