గణపథ్ తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi Launches Tiger Shroff's Ganapath Telugu Teaser

బాలీవుడ్‌ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ త‌న‌యుడిగా తెరంగేట్రం చేసిన టైగ‌ర్ ష్రాఫ్.. కొద్దిరోజుల్లోనే స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. కేవలం వారసత్వాన్నే నమ్ముకోకుండా డ్యాన్స్‌, ఫైట్స్, నటనలో తన టాలెంట్ చూపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా టైగర్ ష్రాఫ్ సినిమాలలో యాక్షన్ హై వోల్టేజ్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘గణపథ్’. ‘ఏ హీరో ఇస్ బార్న్’ అనేది ఉపశీర్షిక. స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండ‌గా తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ‘గణపథ్’ తెలుగు టీజర్‌ విడుదలవడం విశేషం. ఈ సందర్భంగా మెగాస్టార్ ట్విట్టర్ లో.. డియరెస్ట్ టైగర్, కృతి సనన్ మరియు అన్నింటికీ మించి నా గురువు అమిత్ జీ నటించిన ‘గణపథ్’ సినిమా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని టీమ్ మొత్తానికి విషెస్ తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా ఈ టీజర్ ప్రస్తుతం టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. టైగర్ ష్రాఫ్ తన మార్క్ మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

వికాస్‌ భల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 20న దేశవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టైగర్‌ ష్రాఫ్‌, కృతిసనన్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్లను విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, జమీల్‌ ఖాన్‌, గిరీష్‌ కులకర్ణి, రెహమాన్‌, జియాద్‌ బక్రీ, శ్రుతి మీనన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గుడ్‌ కో, పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి విశాల్‌ మిశ్రా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + one =